Paadutha Theeyaga Challaga Song Lyrics

Paadutha Theeyaga Challaga Song Lyrics

Paadutha Theeyaga Challaga Song Lyrics – Telugu

పల్లవి:

పాడుతా తీయగా చల్లగా..
పసి పాపలా నిదరపో తల్లిగా..
బంగారు తల్లిగాపాడుతా తీయగా చల్లగా..

చరణం 1:

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదీ
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటదీ
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదీ
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటదీ
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ

పాడుతా తీయగా చల్లగా..

చరణం 2:

గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మా చాన్నాళ్ళు
గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మా చాన్నాళ్ళు
పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ
పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ
ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు

పాడుతా తీయగా చల్లగా..

చరణం 3:

మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటదీ
మనసుతోటి మనసెపుడో కలసిపోతదీ
మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటదీ
మనసుతోటి మనసెపుడో కలసిపోతదీ
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నదీ
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నదీ
జనమ జనమకది మరీ గట్టిపడతదీ

పాడుతా తీయగా చల్లగా..
పసి పాపలా నిదరపో తల్లిగా..
బంగారు తల్లిగాపాడుతా తీయగా చల్లగా..

Leave a Reply