Bujji Thalli Song Lyrics | Telugu | Thandel

Bujji Thalli Song Lyrics | Telugu | Thandel

Bujji Thalli Song Lyrics | Telugu | Thandel

పల్లవి:

గాలిలో ఊగిసలాడే దీపం లా
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం
నల్లని మబ్బులను చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం

సుడిగాలిలో పడి పడి లేచే
పడవల్లే తడబడుతున్న
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి
నా కోసం ఓ మాటైన మాటాడే
నా బుజ్జి తల్లి….

చరణం 1:

నీరులేని చేపల్లే
తార లేని నింగల్లే
జీవమేది నాలోన
నువ్వు మాటలాడందే

మళ్ళి యాలకొస్తానే
కాళ్ళ యేళ్ళ పడతానే
లెంపలేసుకుంటానే
ఇంక నిన్ను యిడిపోనే

ఉప్పు నీటి ముప్పుని కూడా
గొప్పగ దాటే గట్టోడ్నే
నీ కంటి నీటికి మాత్రం
కొట్టుకుపోతానే

నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జితల్లి…

చరణం 2:

ఇన్ని నాళ్ళ మన దూరం
తియ్యనైన ఓ విరహం
చేదు లాగ మారిందే
అంది రాక నీ గారం

దేన్ని కానుకియ్యాలే
ఎంత బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా
లంచమేంటి కావాలే

గాలి వాన జాడే లేదే
రవ్వంతైనా నా చుట్టూ
అయినా మునిగిపోతున్నానే
దారే చూపెట్టూ

నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జితల్లి…

Bujji Thalli Song Lyrics | English | Thandel

Pallavi:

Gaalilo Oogisalaade
Deepam Laa
Oogisalaade Nee Oosandaka
Naa Pranam
Nallani Mabbulanu Chuttina
Chandrudilaa
Cheekati Kammenu Nee Kaburandaka
Naa Lokam

Sudigaalilo
Padi Padi Leche
Padavalle Tadabadutunna
Nee Kosam
Vechunde Naa Pranam
O Bujji Thalli
Naa Kosam
O Maataina Maatade
Naa Bujji Thalli…

Charanam 1:

Neeruleni Chepalle
Taara Leni Ningalle
Jeevamedi Naalona
Nuvvu Maatalaadande

Malli Aalakosthane
Kaalla Yealla Padathane
Lempalesukuntane
Inka Ninnu Yidipone

Uppu Neeti Muppuni Kooda
Goppaga Datte Gattodne
Nee Kanti Neetiki Matrame
Kottukupothane

Nee Kosam Vechunde Naa Pranam
O Bujji Thalli
Naa Kosam O Maataina Maatade
Naa Bujji Thalli…

Charanam 2:

Inni Nalla Mana Dooram
Tiyyanaaina O Viraham
Chedu Laaga Maarinde
Andi Raaka Nee Garam

Denni Kaanukiyyale
Enta Bujjaginchale
Bettu Nuvvu Dinchela
Lancham Ente Kaavale

Gaali Vaana Jaade Lede
Ravvantaina Naa Chuttu
Aina Munigipothunnaane
Daare Choopettu

Nee Kosam Vechunde Naa Pranam
O Bujji Thalli
Naa Kosam O Maataina Maatade
Naa Bujji Thalli…

Line Of  The Song

ఉప్పు నీటి ముప్పుని కూడా
గొప్పగ దాటే గట్టోడ్నే
నీ కంటి నీటికి మాత్రం
కొట్టుకుపోతానే

Song Credits:

Song: Bujji Thalli (Thandel)
Music: Devi Sri Prasad
Lyrics: Sri Mani
Singer: Javed Ali

Naa Favourite Naa Pellam Song Lyrics

3 thoughts on “Bujji Thalli Song Lyrics | Telugu | Thandel”

Leave a Reply