Top 5 Telugu Motivational Songs
Top 5 Telugu Motivational Songs: సంగీతానికి మనల్ని ఉత్తేజపరిచే లక్షణం ఉంటుంది. అయితే సంగీతానికి సాహిత్యం తోడై మనసును కదిలించే భావనను మరింత ప్రేరణనిస్తుంది. మీరు సవాళ్లను ఎదుర్కొంటున్న లేదా లక్ష్యం కోసం పరితపిస్తున్న కొన్ని పాటలు భావోద్వేగాన్ని మరింత పెంచుతాయి. తెలుగు సినీ కవులు ఎన్నో అలాంటి స్ఫూర్తిదాయకమైన పాటలు రాశారు. అందులో మచ్చుకి ఓ పది పాటలు చూద్దామా..
1. తలబడి తలబడి నిలబడు
పిల్ల జమీందార్ సినిమాలోని ఈ పాట శంకర్ మహదేవన్ పాడారు. సెల్వ గణేశన్ సంగీతం చేసారు. అలానే కృష్ణ చైతన్య రాసిన ఈ పాట సినిమాలోని సందర్భానికి తగట్టుగా అద్భుతమైన భావాలను పలికించారు. మొదట పల్లవి చూస్తే
తలబడి తలబడి నిలబడు
పోరాడే యోధుడు జడవడు
సంకల్పం నీకుంటే ఓటమికైనా వణుకేరా...
వెలుగంటు రాదు అంటే సూరీడైన లోకువర
నిసి రాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయేనురా
నీ శక్తేదో తెలిసిందంటే నీకింకా తిరిగేది
ఔను నిజమే ఈ ప్రపంచానికి వెలుగును పంచే సూర్యుడు ఒక్కసారిగా నేను వెలుగుని ఇవ్వను అంటే ఎంత చిన్నబోతాడు మన దృష్టిలో . చంద్రుడు కూడా నేను వెన్నెలను ఇంకా ఇవ్వబోను అంటే చులకనైపోతాడు కదా. అలానే మనం కూడా మన జీవితానికి ఒక లక్ష్యం అంటూ లేకుంటే లోకం దృష్టిలో లోకువ కామా… ! కృష్ణ చైతన్య రెండు వాఖ్యలోనే అంతులేని భావాన్ని రాశారు . నీ శక్తేదో తెలిసిందంటే నీకింకా తిరుగేముంటుంది.
ప్రకాశం లో సూరిడల్లే
ప్రశాంతంగా చంద్రుడి మల్లె
వికాసం లో విద్యార్థల్లె
ఆలా ఆలా ఎదగాలి
ఇంక చరణాలికి వస్తే
పిడికిలినే బిగించి చూడు అవకాశం నీకున్న తోడు
అసాధ్యమే తలొంచు కొంటూ క్షమించు అనేదా
రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి
గిరా గిరా మని తిరగేస్తుంది క్రమంగా మహా స్థిరంగా
గట్టిగ ప్రయత్నిస్తే Immposible కూడా sorry అంటుంది. అబ్బా ఇలా ఎంత కాలమ తిరుగుతాం అని భూమి తన గమనాన్ని ఆపేస్తుందా..? అలసట లేకుండా తన కక్ష్య లో తిరుగుతూనే ఉంటుంది. Heights of Consistency ని బహుశా భూమిని చూసే నేర్చుకోవాలి.. క్రమంగా మహా స్థిరంగా..!
ప్రతి కల నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే
ప్రతీకమే నువ్వవుతావు ప్రవర్తనే ఉంటే
Try చేస్తే సాధ్యం కానిదంటూ ఏమి లేదని చెబుతూనే Character ని కవి అటకెక్కిన్చలేదు.
Knowledge gives you power, but character respect. It gives you a symbolize (ప్రతీక) in society.
జీవితమే ఓ చిన్న మజిలీ వెళిపోమా లోకాన్ని వదలి
మళ్ళి మళ్ళి మోయగలవా కలల్ని ఈ కీర్తిని
గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం
ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి
ఈ ప్రపంచ లో ఏ జీవరాశి కి లేని అద్భుతమైన శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉన్నది ఏంటో తెలుసా , కల ని కనడం, ఆ కల ని సాకారం చేసుకోవడం. ఇక్కడ ప్రయత్నం వారధి .
ప్రతి రోజు ఉఉగాది కాదా ఉషస్సు నీవైతే
ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపించు..!
kudos! to krishna chaitanya.
2. అభిమాని లేనిదే హీరోలు లేరులే
నాగవల్లి సినిమా లోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ . గురు కిరణ్ గారు మ్యూజిక్ చేసారు . బాల సుబ్రమణియం గారు పాడారు. చంద్రబోస్ రచన. ఈ పాట చరణం లో చంద్రబోస్ గారు పోసిటివిటీ హైట్స్ ని చూపించారు.
నీ శక్తే ఆయుధము నీ ప్రేమే ఆలయము
నమ్మరా ఒరేయ్ తమ్ముడా
నీ చెమటే ఇంధనము ఈ దినమే నీ ధనము
లెమ్మురా నువ్వు బ్రహ్మరా
నీ చెమటే ఇంధనము ఈ దినమే నీ ధనము లెమ్మురా నువ్వు బ్రహ్మరా. ఇంతకంటే ఏం చెప్పగలం. ఒక షోలో అయితే బాలు గారు ఈ మాటకు వేటూరి గారు రాసిన కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అన్నమాటకు ఏ మాత్రం తీసిపోదని అన్నారు.
మనసే కోరే మందు ఇదే
మనిషికి చేసే వైద్యమిదే ..!
3. నీతోనే నువ్వు
గేమ్ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్ ఇది. జాషువా శ్రీధర్ గారు సంగీతం చేసారు. బాలు గారు మొదటి సారి రామజోగయ్య శాస్త్రి గారి పాట పాడారు . ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఒక్క రోజులో పూర్తయ్యే కథ. మోహన్ బాబు గారు విష్ణుల మధ్య సన్నివేశాలు చాలా బాగుంటాయి. సినిమా లో వాళ్ళిద్దరి జీవితంలో జరిగే సంఘర్షణని రెండు చరణాల్లో చాలా బాగా చెప్పారు. అలాగే జీవితానికి కావాల్సిన స్ఫూర్తి కూడా.. ఈ పాట ఎప్పుడు ఎవ్వరు విన్నా , వారి జీవితాన్ని పోలి ఉంటుంది. ఎందుకంటే శాస్త్రి గారు ఇందులో జీవిత సత్యాల్ని రాసేశారు.
నీతోనే నువ్వు సరదాగానే లేనేలేవు
నలుగురిలో నవ్వులనేం చూస్తావు
నువ్వేంటో అర్ధం కావు వేరేగా ఉంటావు
నీ మనసెందుకు నీలోనే దాస్తావు
ఎందుకోసమో ఈ ఆరాటం
ఎంచిచూసుకో అన్నది లోకం
ఒక్కసారి నువ్వు అలోచించు నీ కోసం
ముందువెనకలే చూడని మార్గం
మరిచి పోయినా లౌక్యం కొంచం
పట్టువిడుపుగా సర్దుకుపోవా నీ నైజం
ఎదేదో అనుకుంటావు
ఇంకేదో చేస్తుంటావు
చిక్కుల్లో పడతావు చిత్రంగా
నీడయినా నీ వెంట లేనంది ఈనాడు
నీదే తప్పని నిందలు వేసి
కాలమెంత మారిపోయెరా
ఏ బాధలేనోడు భూమ్మీద లేనోడే
మనిషై పుడితే దేవుడికైనా కంటనీరు కాయమేనురా
జానేదో నేస్తం
జరిగాకే తప్పును చూస్తాం
నిన్నటి లెక్కను నేడే సరి చేద్దాం
నడిరాతిరి నిశ్సబ్ధంలో నిజమేంటో కనుగొందాం
మలిపొద్దుల్లో మెళకువగా అడుగేద్దాం
మనం చేసింది తప్పు అనో, పొరపాటనో జరిగాకే కదా దాని తీవ్రత తెలిసేది. నిన్నటి లెక్కను నేడే సరి చేద్దాం
నడిరాతిరి నిశ్సబ్ధంలో నిజమేంటో కనుగొందాం. మలిపొద్దుల్లో మెళకువగా అడుగేద్దాం. ఇంతకంటే స్ఫూర్తిదాయకమైన మాట ఇంకేముంటుంది .
ఎల్లకాలమీ అల్లరికాలం
ఒక్కతీరుగా ఉండదు నేస్తం
మంచిచెడ్డలు బొమ్మబొరుసే అనుకుందాం
పల్లమేమిటో చూసిన ప్రాణం
లెక్కచెయ్యదే ఎంతటి కష్టం
నేల తాకిన బంతయి మళ్ళీ పైకొద్దాం..!
4. ప్రయత్నమే మొదటి విజయం
చిత్రలహరి సినిమా లోనిది ఈ పాట. కైలాష్ ఖేర్ పాడారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. చంద్రబోస్ గారి రచన. ఈ పాటలో రెండు చరణాలు ఉంటాయి , రెండో చరణం వినాలంటే సినిమా end cards లో వస్తుంది. మరెక్కడ దొరకదు. సరే పల్లవి ముందు చూస్తే
ఓడిపోవడం అంటే
ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే
అవకాశం పొందడమే
ఎందులోనైనా మొదటిసారి గెలిచిన వాడికంటే, ఓడిపోయి గెలిచిన వాడికే ఎక్కువ అనుభవం ఉంటుంది. ఎందుకంటే మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తాడు కాబట్టి.
అడుగు అడుగు వెయ్యనిదే
అంతరిక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే
పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనిదే
మహాసంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే
కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపు ఏమయినా
మధ్యలో వదలొద్దురా
ఈఈ సాధన
ఈ మాటలు విటుంటే వేమన పద్యం ఒకటి గుర్తుకువస్తుంది. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు ఏదేమైనా సరే మనం మొదలుపెట్టిన పని పూర్తి చేయాలి.
ప్రయత్నమే
మొదటి విజయం
ప్రయత్నమే
మన ఆయుధం
ఇక రెండో చరణం కి వస్తే ప్రస్తుతం మన విద్య విధానం లో జరిగేదే. ముఖ్యంగా తల్లి దండ్రులు, ఈ system చేసే పెద్ద తప్పు విద్యార్థుల బలం ఏ రంగం లో ఉందో వారి బలహీనం ఎక్కడో గుర్తించక పోవడం. గుర్తించిన విద్యార్థిని ప్రోత్సహించక పోవడం.
ఎక్కడ నీ బలం ఉంటుందో అక్కడ నువ్వే నిలవాలే
ఎక్కడ నీ తెలివుంటుందో ఆ చోటే నీకే తెలియలే
నింగి లో ఎగిరే పాటికే చెరువులో చేపను పంపొద్దే
చెరువులో ఈదే పోటీకే గగనం లో గువ్వను దింపొద్దే
నీకంటూ తీరొకటుందే నీ తీరులో నువ్వు చేరుకో నీ తీరమే.
గెలుపంటే నీపై నీ నమ్మకం
గెలుపంటే నీ సంతకం.
5. ఒకటే జననం ఒకటే మరణం
భద్రాచలం (శ్రీ హరి) సినిమా లోనిది ఈ పాట. స్వర పరిచింది వందేమాతరం శ్రీనివాస్ గారు. శంకర్ మహదేవన్, చిత్ర గార్లు పాడారు. సాహిత్యం సుద్దాల అశోక్ తేజ గారు. ఈ పాటకి విశ్లేషణ అక్కర్లేదు ఆ అక్షరాలే ప్రేరణ ఇస్తాయి.
ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు
అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు
గెలుపు కొరకే బ్రతుకు
కష్ఠాలు రానీ కన్నీళ్లు రానీ
ఏమైనా కానీ ఎదురీది రానీ
వోడి పోవద్దు రాజి పడొద్దు
నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు
రాబోయే విజయాన్ని
పిడికిలిలో చూడాలి
ఆ గెలుపు చప్పట్లే
గుండెలలో మోగాలి
నీలి కళ్ళల్లో మెరుపు మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలి వానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయల్లో ధ్యేయం చూడాలి.
Top 5 Telugu Motivational Songs